గ్రామీణ ప్రాంత వాసులకు ఉపాధి హామీ పనులతో ఆర్థిక వృద్ధి

Published: Wednesday April 05, 2023
* తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్
వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : 
ఉపాధిహామీ పనులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేశ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ప్రణాళికలో భాగంగా చేపట్టే పనులను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా ఉపాధిహామీ పథకం ప్రతీ పేదవానికీ తిండిపెడుతుందన్నారు. ఈ ఏడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు ఫార్మేషన్ పనులు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ భూములకు చిన్న చిన్న కాల్వలు తవ్వడం, వ్యవసాయ భూములకు దారి ఏర్పాటు చేయడం, చెరువులను లోతు చేయడం వంటి పనులు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామకార్యదర్శి సుమిత్ర, టీఏ గంగయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భుజంగం, సిద్ధప్ప, రాములు, రవి, ప్రవీణ్, రాచప్ప, రాజు, నర్సింహలు తదితరులు పాల్గొన్నారు.