మధిర మండలం నుంచి డెప్యూటేషన్ మీద వెళ్లిన డాక్టర్ ను వెంటనే వెనుకకు పంపించాలి

Published: Thursday April 29, 2021

మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీపరిధి హాస్పిటల్స్ లో పనిచేస్తున్న డాక్టర్స్ బదిలీ నిలిపి వేయాలని మధిర కు ఐసోలేషన్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నించిన మల్లు భట్టి విక్రమార్క DMHO కు వెంటనే ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేయాలి అని ఆదేశించిన మధిర శాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ఈరోజు మధిర పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీ చేసి కరోనా రోగులకు ఇస్తున్న ట్రీట్మెంట్ ల గురించి, వ్యాక్సినేషన్ గురించి, కరోనా టెస్ట్ గురించి స్థానిక వైద్యులు శ్రావణ్ కుమార్ గారిని అడిగి ఆరా తీసిన మల్లు భట్టి విక్రమార్క గారు మధిర ప్రాంతంలో మరియు ఆంద్రా నుంచి కూడా కరోనా రోగులు ఎక్కువగా గా మధిర గవర్నమెంట్ హాస్పటల్ కు వస్తున్నారని, మధిర గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని వసతులు సరిగా లేవని.. భట్టివిక్రమార్క గారి దృష్టికి తీసుకువచ్చారుభట్టి విక్రమార్క గారు వెంటనే DMHO గారికి ఫోన్ చేసి.. మధిర లో ఎందుకు ఐసోకేషన్ కేంద్రం ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నించారుమధిర హాస్పిటల్ పై సవతి ప్రేమ ఒలకబోస్తూన్నారని.. వెంటనే మధిరలో ఐసోకేషన్ కేంద్రం ఏర్పాటు తో పాటు మధిర మండలం నుంచి ఇతర ప్రాంతాలకు డెప్యూటేషన్ మీద వెళ్లిన డాక్టర్స్ ను వెంటనే తిరిగి మధిర పంపించాలి అని ఆదేశించారువ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వైద్యాధికారులకు సూచించారు. వ్యాక్సిన్ లేదా కరోనా టెస్ట్ ల కిట్స్ కొరత వస్తే వెంటనే తనకు సమాచారం ఇస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రావణ్ కుమార్, అనిల్, శ్రీనివాస్, రమాదేవి, కాంగ్రెస్ నాయకులు  వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూరంసెట్టి కిషోర్, దార బాలరాజు, తూమాటి నవీన్ రెడ్డి, కర్నాటిరామారావు, ఎస్ కె జహంగీర్, పారుపల్లి విజయ్ కుమార్. జింకల కోటేశ్వరరావు, అదురి శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు..