ఆర్టీసీ కండక్టర్ల గొడవతో...ప్రయాణీకుల అగచాట్లు – డీపో మేనేజర్‌ ఏకపక్ష నిర్ణయంతో సిబ్బంది ఆగ్

Published: Tuesday July 05, 2022

వికారాబాద్‌ బ్యూరో జూలై 04 ప్రజాపాలన : వికారాబాద్ ఆర్టీసీ డీపోలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కండక్టర్ల మధ్య గొడవ కారణంగా ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. పాత గొడవలే ఇద్దరు కండక్టర్ల మధ్య గొడవకు మూల కారణం. కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న సుదర్శన్, పిఆర్సిరెడ్డిల పాత గొడవే చిలికి చిలికి బస్సులు ఆగే వరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య గొడవను బస్ డిపో మేనేజర్ మహేష్ కుమార్ పూర్వపారాలను పరిశీలించి గొడవకు కారణం ఎవరో తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ప‌నిచేస్తున్న కార్మికులకు కోప‌మొచ్చింది. ఈ కార‌ణంగా సోమ‌వారం ఉద‌యం నుంచి డీపోలోని బ‌స్సులు డీపోకే ప‌రిమితం అయ్యాయి. ఇటీవ‌లే వీరి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో డీపో మేనేజ‌ర్ మ‌హేష్ వ‌ద్ద‌కు వెళ్లి ఒకరిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ పంచాయ‌తీలో డీపో మేనేజ‌ర్ సుద‌ర్శ‌న్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇద్ద‌రి పంచాయ‌తీలో డీపో మేనేజ‌ర్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. సోమ‌వారం ఉద‌యం నుంచి కార్మికులంతా విధులు బ‌హిష్క‌రించారు. ఇద్ద‌రి కార్మికుల గొడ‌వ, డీపో మేనేజ‌ర్ పంచాయ‌తి, కార్మికుల ఆందోళ‌న వ‌ల్ల ఆర్టీసీ బ‌స్సుల‌న్నీ డీపోకే ప‌రిమితం అయ్యాయి. ఇద్ద‌రి పంచాయ‌తిని న్యాయంగా ప‌రిష్క‌రించాల‌ని, అంత‌వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని కార్మికులు భీష్మించారు.  కొన్ని గంట‌ల త‌రువాత ఆర్టీసీ డీపో మేనేజ‌ర్, కార్మికుల మ‌ద్య స‌యోధ్య కుద‌ర‌డంతో వివాదం స‌మిసి పోయింది. చ‌ర్చలు ఫ‌లించిన త‌రువాత బ‌స్సులు రోడ్డెక్కాయి.

వికారాబాద్ బస్ డిపో మేనేజర్ మహేష్ కుమార్ వివరణ : సుదర్శన్ పి ఆర్ సి రెడ్డి లు వికారాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. గత గొడవ కారణంగా సోమవారం ఉదయం బస్ డిపోలో కార్మికులు ప్రయాణికుల సమక్షంలో మళ్లీ గొడవపడ్డారు. అసలు గొడవకు కారకులు ఎవరనేది ప్రత్యక్ష సాక్షులు కార్మికులు ప్రయాణికులను సంప్రదించి విషయం తెలుసుకున్నాను. ముద్రణకు నోచుకోని బూతు మాటలతో సుదర్శన్ పిఆర్సి రెడ్డిని జీవీకే రెడ్డిని తిట్టాడని ప్రయాణికులు చెప్పారని అన్నారు. ఒకరిపై మరొకరు కూడా ఫిర్యాదులు చేసుకున్నారని స్పష్టం చేశారు. విచారణ అనంతరం సుదర్శన్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు డిపో మేనేజర్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.