భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండగ వేడుకలు

Published: Thursday July 22, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 21(ప్రజాపాలన) : బక్రీద్ పండగ వేడుకలను ముస్లిం సోదరులు బుధవారం జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మసీదులలో ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహమ్మద్ ప్రవక్త చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఇమామ్ లు సూచించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని బజార్ వాడీలో గల జామియా మజీద్ వద్ద మైనార్టీ నాయకులు (జర్నలిస్ట్) అబ్దుల్ రెహమాన్, షబ్బీర్, సాజిద్, సలామ్, తదితర ముస్లిం సోదరులు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.