రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి కొత్త రుణాలు ఇవ్వాలి

Published: Thursday March 10, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ. రైతుల రుణాలు బ్యాంక్ లో వడ్డీకి వడ్డీ పెరిగి పోవటంతో బ్యాంక్ అధికారులు రైతులకు నోటీస్ లు పంపించటమే కాకుండా రైతుల ఇండ్ల దగ్గరకు వెళ్లి మీరు బ్యాంక్ అప్పు కట్టాలి లేకపోతే రినివల్ చేసుకోవాలి అని రైతులను నాన ఇబ్బందులకు గురిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం లక్ష లోపు రుణాలు పూర్తి స్థాయిలో మాపి చేసి కొత్త రుణాలు మంజూరు చేస్తాం అని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కేసీఆర్ మళ్ళీ ఎన్నికలు జరిగే సమయం వస్తున్న ఇప్పట్టి వరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు మాపి చేయక పోవటం సిగ్గు చేటు అన్నారు నాలుగు విడతలుగా రుణాలు మాపి చేస్తాం అని మాట మార్చి చెప్పిన కేసిర్ రెండు విడుతాల సమయం దాటి పోయింది ఎంత మంది రైతులకు యాభై వేలు రుణాలు మాపి చేసారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు మళ్ళీ ఇప్పుడు మూడో విడతలో 75 వేలు మాపి చేస్తాం అని ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ అమిలు ప్రకటన లకు మాత్రమే అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేస్తాడో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను రైతులు నమ్ముతారు లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పటం కాయం అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి లక్ష లోపు రుణాలు వడ్డీ తో సహా పూర్తి స్థాయిలో మాపి చేయాలి కొత్త రుణాలు మంజూరు చేయాలి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తాం అని హెచ్చరిస్తున్నాం