మానవత్వం చాటిన మెకానిక్ సంఘం గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న మెకానిక్ కి ఆర్థిక సాయం

Published: Monday August 01, 2022
బోనకల్, జూలై 31 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ దోబ వీరబాబు కు గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నాడు, తన చికిత్సకు డబ్బులు పెద్ద మొత్తంలో కావడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తన కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బంది పడుతున్న వీరబాబు కుటుంబానికి చేయూత అందించాలని బోనకల్ మండలం మెకానిక్ సంఘం అధ్యక్షుడు గోగులు రామారావు ఆలోచించి జిల్లా మెకానికల్ సంఘం అధ్యక్షుడు వంగల కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షుడు, వలి పాషా దృష్టికి తీసుకువెళ్లి వీరబాబు కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరడంతో స్పందించిన వారు జిల్లాలోని మెకానికులకు ఫోన్ చేసి ఆర్థికంగా సాయం చేయాలని కోరడంతో మెకానికులు వారికి తోచినంత సహాయం చేసి వసూలైన 28000 రూపాయలు నగదును మెకానిక్ వీరబాబు కు సహాయం అందించారు. జిల్లాలో టు వీలర్ మెకానికులు ఆర్థికంగా గాని, యాక్సిడెంట్లు వల్ల గాయపడిన వారికి ప్రతి ఒక్కరికి మేమున్నామంటూ జిల్లా టు వీలర్ అసోసియేషన్ బాధితులకు భరోసా కల్పించారు. ఆర్థిక సాయం అందించిన మెకానిక్ సంఘానికి గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెకానికల్ సంఘం అధ్యక్షుడు వంగల కొండలు, జిల్లా ఉపాధ్యక్షుడు వలి భాష, బోనకల్ మండలం మెకానిక్ సంఘం అధ్యక్షుడు గోగుల రామారావు, ఖమ్మం టౌన్ సెక్రటరీ లింగన్న, బోయిన మురళి, మధిర టౌన్ సెక్రటరీ గొల్లపల్లి శ్రీనివాస చారి,మెకానికులు అశోక్, దుగ్గిపోయిన తరుణ్, పుట్ట నాగేశ్వరరావు, పుట్ట నరసింహారావు, జమలయ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.