ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *ఎస్సీ కమ్యూనిటీ హాల్ పరిశీలించిన సర్పంచ్ బూ

Published: Friday November 04, 2022

ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించిన సర్పంచ్ బూడిద రాంరెడ్డి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిధులనుండి 5లక్షలు మరియు   డిఎంఫ్ నుండి 10లక్షల రూపాయలతో మంజూరు చేయించి ఎస్సీ కమ్యూనిటీ నూతన భవనం నిర్మాణం జరుగుతున్నది
అనంతరం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి  దేవాలయం సందర్శించి పనుల పురోగతి గురించి  అడిగి తెలుసుకున్నారు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బూడిద రామ్ రెడ్డి మరియు తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిఎన్ఆర్ సంస్థల అధినేత బూడిద నందా రెడ్డి గార్ల సహకారంతో సుమారు 25 లక్షలు రూపాయలతో నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి గుడిని పరిశీలించడం జరిగింది.