మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సెకండ్ డోస్ వాక్సినేషన్

Published: Thursday December 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం ఛైర్ పర్సన్ ఆధ్వర్యంలో  వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ సెకండ్ డోస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే ను పురస్కరించుకుని మెడికల్ సిబ్బందితో ప్రత్యేక అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 నాటికి పారిశుద్ధ్యం విషయంలో వికారాబాద్ మున్సిపల్ ను మరింత మెరుగైన ర్యాంకు సాధించే దిశగా తీసుకెళ్లడానికి మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది, కార్మికులు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ముఖ్యంగా డిసెంబర్ 1 ఎయిడ్స్ డే ను పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలో చాలా వరకు ఎయిడ్స్ కేసులు తగ్గడం ఆనందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, మెడికల్ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.