పేదల భూములు కబ్జాకు గురైతే రాష్ట్రం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి కనిపించవా?

Published: Monday May 03, 2021
పరిగి, 2 మే, ప్రజాపాలన ప్రతినిధి : పేద మధ్యతరగతి  దళిత కుటుంబాలకు తిరిగి భూమి ఇవ్వకపోతే సుగుణ ఐరన్ ఫ్యాక్టరీ యాజమాన్యం అధికార పార్టీ నాయకుల భరతం పడతాం అన్ని బిజెపి పి ఎన్ పి ఎస్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేసారు. పేదల భూములు అధికార పార్టీ అండతో కబ్జాలకు గురవుతుంటే ప్రభుత్వం కి కనిపించడం లేదా! అని బీజేపీ, పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి (PNPS) మరియు యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని పరిగి మండలంలోని లక్ష్మీ దేవిపల్లి వద్ద గల సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు యాదయ్య, PNPS అధ్యక్ష కార్యదర్శులు బాలకృష్ణ, హన్మంత్ లు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీ దేవి పల్లి సమీపంలోని, నారాయణ పూర్ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 143,144,145 లో గల 32 ఎకరాల 22 గుంటల భూమి అధికారులు మరియు నాయకులు కుమ్మక్కై అన్యాక్రాంతం చేసిన భూదాన్ భూమిని ప్రభుత్వం వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్న అధికారుల, ప్రభుత్వ కళ్ళు కనిపించడం లేదా అని ప్రశ్నించారు? సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని భూదాన్ భూమిని ఖబ్జా చేయడమే కాకుండా, రెవెన్యూ అధికారుల నోటీసులను భేఖాతరు చేస్తూ తన వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం వల్లనే అధికారులు మౌనం వహిస్తున్నారు అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ముఖ్యమంత్రి, ఉన్న భూమి సొంత పార్టీ నాయకుల అండతో కబ్జాకు గురైతే కనీసం స్పందించడం లేదన్నారు. ఈటెల రాజేందర్ మీద హుటాహుటిన విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి కి ఇన్ని ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న పేదల భూములు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అందుకే కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నాం అన్నారు. వెంటనే ఫ్యాక్టరీ ని ఖాళీ చేయించి భూదాన్ భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయాలని లేదంటే భవిష్యత్ లో గుర్రంపోడు తరహాలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతు యాదయ్య నర్సింలు బీజేపీ పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, గోపాలకృష్ణ నాయకులు రాజు, నర్సింహ, ఎర్రగడ్డ పల్లి రమేష్, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.