జస్టిస్ పున్నయ్య సిఫార్సులపట్ల అధికారుల నిర్లక్ష్యం

Published: Wednesday April 27, 2022

మెట్పల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన): మెట్పల్లి పట్టణంలో మంగళవారం దళిత గిరిజన బహుజన సంఘాల ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ  పోరాట ర్యాలీలో  అఖిల భారతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ప్రొఫెసర్ నునావత్ దేవదాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాయక్ మాట్లాడుతూ ర్యాలీలో నియోజకవర్గంలోని దళిత గిరిజన బహుజన వర్గాల ప్రజలు అనేక సంఖ్యలో పాల్గొని ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేశారని అన్నారు. కావున నియోజకవర్గ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మల్లాపూర్ మండలం నడికూడా గ్రామం మరియు మెట్పల్లి పట్టణంలోని ఆరాపేటలో దళితులను కుల వివక్షతకు గురిచేయడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానించిన నిందితులను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరుపున భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ పున్నయ్య సిఫార్సుల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుకారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు అరవింద్ రాథోడ్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ నాయక్, అంబేద్కర్ సంఘ నాయకులు ఎర్ర రమేష్, దళిత బహుజన సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు