నేడేబోడెపుడి సేవా సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Published: Saturday November 26, 2022

మధిర రూరల్ నవంబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి) బోడేపుడి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతినెల 4వ శనివారం మధిర బోడేపుడి భవన్ నందు (సిపియం ఆఫీస్) నిపుణులైన వైద్యుల సమక్షంలో  వంద రూపాయలకే బి.పి. షుగుర్ మందులను నెలకు సరిపడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు అదేవిధంగా శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఆధ్వర్యంలో మధిరలో ఉచిత కంటి పరీక్షలు చేస్తారని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 9705192947, 7780166010 సెల్ నెంబర్లో సంప్రదించవలసిందిగా వారు కోరారు.