అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేటట్లు సంక్షేమ పథకాలు చూడాలి: మంత్రి

Published: Tuesday February 09, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మో నీ రోహిణి రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలు కాలనీలలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి , కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లు కలిసి 52.50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు రేషన్ , కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేవని.. తెలుసుకునే బాధ్యత కార్పొరేషన్ కార్పొరేటర్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచనలు ఇచ్చారు. అదేవిధంగా రాగన్నగూడ లో కృష్ణ మంచి నీళ్లు  పైప్ లైన్ ఎలాగైనా సరే వచ్చేటట్లు చేస్తానన్నారు. ఇక్కడ వ్యవసాయం తో జీవనం గడిపే వాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకు ముందే నా దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగపడే, ప్రభుత్వ భూముల మీద  జీవనం గడుపుతున్న వారు ఆ భూములకు పట్టాలు ఉన్నట్లయితే వాటిని ఎవరు తీసుకోవడం ఉండదని హామీ ఇచ్చారు. అదేవిధంగా భూమి మీద ఆధారపడి బ్రతికే వారికి కూడా ఆధారం కల్పిస్తామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... కాలనీవాసులు అందరికీ సబితమ్మ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి  ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు దగ్గరుండి చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, టిఆర్ఎస్  కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగు రామ్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, బిమిడీ స్వప్న జంగారెడ్డి, బాలు నాయక్, జెనీగ భారతమ్మ కొమురయ్య, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ ఈ అశోక్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, వెంకటాపురం మాజీ సర్పంచ్  జగన్ రెడ్డి, మత్స్యకారుల అసోసియేషన్ అధ్యక్షులు శంకరయ్య, కాలనీవాసులు మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.