ఎర్రుపాలెం రైతు వేదికలో రైతుబంధు సంబరాలు...

Published: Friday January 07, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : రైతు బందు సంబరాలులో భాగంగా ఎర్రుపాలెం రైతువేదిక దగ్గర జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి మండల ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష, జెడ్ పి టి సి శీలం కవితి, ఎర్రుపాలెం సర్పంచ్ అప్పారావు, ఎం పి టి సి షేక్ మస్తాన్ వలి కత్తులు, సోసైటి చైర్మన్ ముల్పూరి శ్రీనివాస రావు, పాలభిషేకంచేసినారు. అనంతరం ఎంపీపీ దేవరకొండ శిరీష మాట్లాడుతూ రైతులకు ఇది ఒక వరం అని, కరోనా కష్టకాలంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని రైతుబంధు తో వారిలో భరోసా కలిగింది అని, ఒక రైతు బంధు కిందనే 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో చేరుతున్నాయి అని, ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రంలో భీమవరం ఎం పి టి సి సంకాంత్రి క్రిష్ణారావు, పెద్ద గోపవరం ఎం పి టి సి సగ్గుర్తి కీషోర్ బాబు, సర్పంచులు పురుషోత్తం రాజుగారు, కోట శ్రీనివాసరావు, సర్పంచ్ యరమల రేణుక, కత్తి నాగమ్మ, సర్పంచ్ గోపాలరావు, రాము, సోసైటి చైర్మన్ అనుమోలు సాంబశివరావు, మీనవోలు సోసైటి ఛైర్మన్ కుడుముల మధన్‌ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, కోల్లు శ్రీనివాసరావు, దేవరకొండ రవి, నండ్రు రవి, తక్కెళ్ళ పాటి వెంకటేశ్వర్లు, షేక్ బాజీ, షేక్ హుస్సేన్, మీనవోలు హుస్సేన్‌, రైతు సంఘం నాయకులు బొర్ర మురళి మోహన్ రావు, బుర్ర నారాయణ, ఎస్సీ సెల్ భాస్కర్, ప్రకాష్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.