ప్రతి జీవికి మెరుగైన ఆరోగ్యం అందించాలి

Published: Wednesday July 07, 2021

మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో మంగళవారం రోజున ప్రపంచ జూనోసెస్ డే, జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధి రోజు సందర్భంగా ఆరోగ్య హక్కు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక అధ్యక్షుడు, అడ్వకేట్ ఆర్.ఎల్.మోతె మాట్లాడతూ. జంతువుల నుంచి మనుషులకు బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా, ఆంత్రాక్స్, బర్డ్ ఫ్లూ, చింపాంజీలు, ఎబోలా, రేబిస్ మొదలగునవి పరిగణిస్తారన్నారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్య పరచడమే జూనోసెస్ డే ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన అన్నారు. నేడు మానవాళి ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి కూడా గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు తేలిందన్నారు. జంతువుల నుంచి మానవుడికి సంక్రమించే ఈ తరహా వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అవసరమన్నారు. వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలన్నారు, మన చుట్టూ ఉన్న జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరం కృషి చేయాలన్నారు ప్రభుత్వాలు జూనోటిక్ వ్యాధుల పట్ల చైతన్యం కలిగించాలన్నారు. ప్రతీ జీవి స్వేచ్ఛ గా, ఆరోగ్యం గా మనుగడ సాగించేలా ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు నంది పాటి రాజు, సభ్యులు సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.