గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల కు తక్షణ సహాయ నగదు... --ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

Published: Friday July 22, 2022

జగిత్యాల, జూలై, 21 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలంలో 12 గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల కు తక్షణ సహాయ నగదు మొత్తం లబ్ది దారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేసినారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 53 ఇండ్లకు 3200  చొప్పున ఇంటి యజమానులు కు అందజేయటం జరిగింది అని  అన్నారు. భారీ వర్షంలో దెబ్బతిన్న ఇండ్ల వారిని గుర్తించవలసిన భాధ్యత  నాయకులు, అధికారుకులది అని అన్నారు. భారీ వర్షాలకు అనునిత్యం అందుబాటులో ఉన్న నాయకులు, అధికారులకు ధన్యవాదాలు అని అన్నారు. సంక్షేమం లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, పెన్షన్ లు, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని ప్రజలు గుర్తించాలని, అభివృద్ధి కోసం పాటు పడే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మండల రైతు బందు సమితి కన్వీనర్ కొల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సురేందర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శేకర్ గౌడ్, పిఎసిఎస్  ఛైర్మెన్ లు మల్లారెడ్డి, నరసింహ రెడ్డి, యూత్ అధ్యక్షులు మధన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.