నవంబర్ 1న జరిగేఅఖిల భారత నిరసన దినమును విజయవంతం చేయండి : టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వి.రా

Published: Thursday October 28, 2021
బోనకల్, అక్టోబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : విద్యలో అంతరాలను పెంచే ఎన్ ఈ పి 2020 అమలును నిలిపివేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం తదితర తాత్కాలిక ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా నవంబర్ 1న ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే నిర్వహించాలని ఎస్ టి ఎఫ్ ఐ కేంద్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఆమేరకు ఎస్ టి ఎఫ్ ఐ అనుబంధ సంఘంగా టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలక్టరేట్ ల వద్ద నవంబర్ 1 సాయంత్రం 4.00 గంటలకు నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతికి మెమోరాండమ్ పంపించాలి. ఈ నిరసన ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. ఈకార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షురాలు పి.సుశీల, ఉపాధ్యక్షులు యం.సి.చంద్రప్రసాద్, పి.పుల్లారావు, పి.గోపొల్ రావు, బి.శ్రప్రీతమ్, ఏ.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.