రేషన్ డీలర్ల సమస్యలపై తాసిల్దార్ కు వినతిపత్రం

Published: Tuesday July 05, 2022
బోనకల్, జూన్ 5 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం స్థానిక తహసిల్దార్ ఆఫీస్ నందు రేషన్ డీలర్ల కమిషన్ విషయం ,ఉద్యోగ భద్రత, రేషన్ డీలర్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్ కొరకు నిరసన తెలియ చేస్తూ స్థానిక తాసిల్దార్ రావూరి రాధికకు వినతిపత్రం సమర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు, బోనకల్ మండల అధ్యక్షులు తోట లింగయ్య ,జిల్లా ఉపాధ్యక్షుడు బంధం అచ్చయ్య, మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు చొప్పకట్లపాలెం డీలర్ టి నర్మదా, బోనకల్ డీలర్ (1)భూక్య వరలక్ష్మి, బోనకల్ డీలర్(2) అశోక్ కుమార్, డీలర్ సంఘపు పద్మ పాల్గొన్నారు