సంక్షేమం, అభివృద్ధి లక్యంగా ప్రభుత్వం పని చేస్తుందని

Published: Thursday June 16, 2022
రాష్ట్ర మంత్రి  వేముల ప్రశాంత్రెడ్డి
 
మంచిర్యాల బ్యూరో,  జూన్ 15, ప్రజాపాలన  :
 
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన వ్యవహారాలు, హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమవు తున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హెూళ్ళికేరి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా ప్రజలకు ఒకే చోట లభించే విధంగా ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల ద్వారా అన్ని శాఖలు, విభాగాలు ఒకే చోట ఉండటంతో సేవలు వేగంగా అందుతాయని అన్నారు. 1 లక్షా 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో 38 ప్రభుత్వ శాఖలతో కలెక్టరేట్ సముదాయం నిర్మాణం చేపట్టి దాదాపు 70 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. , సెప్టెంబర్ మాసాంతంలోగా మిగిలిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో సెక్రటేరియట్ల తరహాలో మన రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్లు నిర్మించడం జరుగుతుందని, జిల్లాలోని ప్రజల చిరకాల కోరిక అయిన గోదావరి నదిపై వంతెన నిర్మాణం త్వరలోనే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు