నేడు బోనకల్ లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

Published: Monday January 30, 2023

బోనకల్, జనవరి 29 ప్రజా పాలన ప్రతినిధి: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మండల కేంద్రంలో ఎస్సార్ ఫంక్షన్ హాల్ నందు మధిర నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశo నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున నియోజకవర్గ స్థాయి నుండి జనసమీకరణ చేయాలని పొంగులేటి అనుచరులకు ఆదేశించారు. ఈ ఆత్మీయ సమావేశం మొదటగా పినపాక నుంచి విడతల వారీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ నెల 30 న సోమవారం మధిర నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశమును బోనకల్ మండల కేంద్రంలో ఎస్సార్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. కావున మధిర నియోజకవర్గం లో భారీ ఎత్తున ప్రజలు శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఈ ఆత్మీయ సమావేశమునకు తరలిరావాలని పొంగులేటి అనుచరులు కోరుతున్నారు.