ఘనంగా కామ్రేడ్ బడ్డు నర్సింహ మొదటి వర్థంతి వేడుకలు

Published: Monday May 09, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం రోజు ఆరుట్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది. సీపీఎం జిల్లా నాయకుడిగా, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శిగా, డి వై ఎఫ్ ఐ,పి ఎన్ ఎం సి ఐ టి యు తదితర సంఘాల్లో జిల్లా స్థాయిలో పనిచేసిన కామ్రేడ్ బడ్డు నర్సింహ గత సంవత్సరం కరోన వల్ల చనిపోవడం జరిగింది. పోరాటాల పురిటీ గడ్డ ఆరుట్ల లో నిరుపేద కుటుంబం లో పుట్టి, అనేక ఉద్యమాలలో పాల్గొని, అనేక కేసులు ఎదుర్కొని, ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తూ కరోన మహమ్మారి వల్ల మరణించడం జరిగింది. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పుల్లగాళ్ల గోపాల్, మండల కమిటి సభ్యులు మార బుగ్గరాములు,నూకం రవి, శాఖ కార్యదర్శులు సాతిరి సత్యం, చిందం కృష్ణ,  పి ఎన్ ఎం నాయకులు గణేష్, జోగు నర్సింహ, బూర పరేశ్, చెరుకు రాంచెంద్రయ్య, బుగ్గయ్య, ప్రవీణ్, శేఖర్, గణేష్, మహేష్, ప్రసాద్, ముకేష్, సుదర్శన్, వినోద్, అంజయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.