విశ్వనాథ ఆలయంలో బతుకమ్మ సంబరాలు. మంచిర్యాల టౌన్, అక్టోబర్ 03, ప్రజాపాలన:

Published: Tuesday October 04, 2022

మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని వివిధ వార్డులకు చెందిన వనితలు ప్రత్యేక అలంకరణ ఆకర్షణతో   సాంప్రదాయాలతో గౌరమ్మ లను తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటలలో అందమైన సాంప్రదాయాలతో కూడిన బతుకమ్మను తయారుచేసిన వనిత లకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 15 మందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కేసెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలమాసు ప్రవీణ్, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్త శ్రీనివాస్, బహుమతుల దాత మాదంశెట్టి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.