ఏ ఐ కే కే ఎస్ ఆధ్వర్యంలో లో మోడీ దిష్టిబొమ్మ దహనం

Published: Thursday May 27, 2021

బెల్లంపల్లి మే 26 ప్రజా పాలన ప్రతినిధి : మూడు నల్ల  రైతు చట్టాలు రద్దు చేయాలని రైతులు చేస్తున్న పోరాటం ఆరు మాసాలు పూర్తి కావొస్తున్నా సందర్బంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు బెల్లంపల్లిలోని ఏఎంసీ సెంటర్ వద్ద నల్ల జెండాలు ప్రదర్శించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అఖిలభారత విప్లవ రైతు సంఘం నాయకులు తెలిపారు. బుధవారం నాడు నిరసన అనంతరం సంఘం రాష్ట్ర కన్వీనర్ గోగర్ల్ శంకర్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్న మూడు నల్ల రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతుంటే రద్దు చేయకుండా పోరాడుతున్న రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని  ఇప్పటివరకు నాలుగు వందల మంది రైతులు అమరులయ్యారని అన్నారు, ఇంత కరోనా ఉద్ధృతిలో కూడా రైతులు పోరాటాన్ని విరమించకుండ  కొనసాగిస్తున్నారని తక్షణమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కల్వల ప్రకాష్, పీ, ప్రవీణ్, ఏ, లక్ష్మీనారాయణ, ఆర్, మల్లయ్య, అచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.