ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి ** ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభలు**

Published: Monday February 20, 2023

వీధినాటకోత్సవాల ను జయప్రదం చేయండి ఫిబ్రవరి 26,27,28 - 2023, స్థలం: ఇబ్రహీంపట్నం

*దేశమును ప్రేమించుమన్న - మంచియన్నది పెంచుమన్న.*

దేశమంటే మట్టి కాదోయ్ - దేశమంటే మనుషులోయ్. అన్న గురజాడ అన్న అడుగుజాడల్లో నడుస్తూ. కష్టజీవుల పక్షాన సాంస్కృతిక మార్గంలో ముందుకు సాగుతోంది ప్రజానాట్యమండలి. పేద, ధనిక తేడాలులేని కులం, మతం అంతరాలు లేని సమాజాన్ని కోరుకొని ఆ దిశగా... ఆటై, పాటై ప్రవహిస్తోంది. పనిలో కష్టం మరిచేందుకు మనిషి సృష్టించుకున్న కళను.. వారి కష్టాలను తుడిచే ఆయుధంగా మార్చింది ప్రజానాట్యమండలి. ధనవంతులు కుబేరులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్న ఈ తరుణంలో... కరోనా వారి కష్టాల్ని రెట్టింపు చేసింది. అండగా ఉండాల్సిన పెద్దలు ధనవంతులకే మద్దతిస్తూ పేదల్ని చీల్చెందుకు కుల, మతాల సిచ్చు రాజేస్తున్నారు. మీడియా, ప్రచార సాధనాల్ని పావులుగా వాడుకుంటూ అనత్యాల్ని విస్తరింప జేస్తున్నారు. వీటన్నిటికీ ధీటుగా శాంతి, సౌఖ్యం, ప్రేమ, దయాగుణాల్ని, నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముంది.జన చైతన్యం కోసం ప్రజా సాంస్కృతిని కాపాడుకుంటూ - ఏనాటికైనా మనిషే అజేయుడనే సత్యాన్ని వెలుగెత్తి చాటాలి. ఈ కర్తవ్యాన్ని ప్రజానాట్యమండలి దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ కృషిని విస్తరించేందుకు, సాంస్కృతిక రక్షణకు మరోసారి మీ ముందుకొస్తోంది. ప్రజానాట్యమండలి. జిల్లా వీధినాటకోత్సవాల పేర వందలాది మంది కళాకారుల్ని ఒకే చోట చేర్చి ప్రజా సాంస్కృతిక సంబరాల్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకు మీలాంటి పెద్దల సహకారం కావాలి. శక్తికి మించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్థికంగా, హార్థికంగా చేయుతనివ్వాలని మా విజ్ఞాప్తి.