రక్తపోటు మధుమోహ బాధితులు ఆరోగ్య నియమాలు పాటించాలి : డాక్టర్ ప్రశాంత్

Published: Friday November 25, 2022

బోనకల్ , నవంబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని కలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తపోటు, మధుమేహ బాధితులకు ఎన్ సి డి కిట్స్ ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె ప్రశాంత్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మధుమేహ, రక్తపోటు బారిన పడినవారు ఎప్పటికప్పుడు ఆరోగ్య నియమాలు పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు ప్రభుత్వం అందించే ఉచిత మందులను వినియోగించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలకు నిర్దేశించిన గణన సంఖ్య ప్రకారం మధుమేహ రక్తపోటు జాబితాను తయారు చేశారు. ప్రతి మంగళవారం కలకోట గ్రామంలో ప్రతి గురువారము రాయనపేట,నారాయణపురం గ్రామాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి మధుమేహ రక్త పోటు బాధితులకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సిబ్బంది ద్వారా మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రశాంత్ చేస్తున్న సేవల పట్ల గ్రామంలోని ప్రజలు అభినందిస్తున్నార. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.