2న సంగీత వాయిద్యాల శిక్షణ తరగతులు ప్రారంభం..

Published: Friday January 27, 2023
తల్లాడ, జనవరి 26 (ప్రజా పాలన న్యూస్): 
 
 తల్లాడ మండల పరిధిలోని వెంకటగిరి సీయోను ప్రార్థన మందిరంలో పిబ్రవరి 2వ తేదీన  సంగీత వాయిద్యాల శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు కే.కుమార్ గురువారం తెలిపారు. తల్లాడ, కల్లూరు, వైరా మండలాల పరిధిలో వారికి తబలా, కాంగ్, డోలక్, డ్రమ్స్ నేర్పించనున్నట్లు వెల్లడించారు. నెలలో ప్రతి గురువారం ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  ఆసక్తిగల వారు 7032256524, 8185841649, 9177686175 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.