అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయాస్తమాన పూజలు

Published: Thursday December 22, 2022
మధిర రూరల్  డిసెంబర్21(ప్రజాపాలన ప్రతినిధి ప్రతిని) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో బుధవారం నాడు  జరిగిన ఉదయాస్తమాన పూజల్లో పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం మాలాదారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాత  పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులు అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా దాత పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం అయ్యప్ప స్వాములు చేయటం అయ్యప్ప స్వామి కృప అందరికీ ఉండాలని వారు తెలిపారు అన్నదాన కార్యక్రమానికి  ముఖ్యఅతిథి విచ్చేసి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు అనంతరం పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులు సాయంత్రం జరిగే స్వామి అయ్యప్ప అయ్యప్పపడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించి భక్తులకు మాలాదారులకు తీర్థప్రసాదాలు అందించి బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవిశెట్టి రంగారావు పుల్లారావు నాగభూషణం సుబ్బారావు రమేష్ గాంధీ శ్రీనివాస్ కాశి వంకరపాటి నాగేశ్వరావు బాబు మేడం వెంకటేశ్వర రావు మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, గాంధీ స్వామి ఎంఆర్సి రావు స్వామి తదితరులు పాల్గొన్నారు.