అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Saturday December 10, 2022
 అసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 9 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
అర్హులైన దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా ధ్రువపత్రాలు అందించి పింఛన్, ఇతర సదుపాయాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సదరం జిల్లా కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదరం శిబిరం ద్వారా అర్హులైన దివ్యాంగులకు ధ్రువపత్రాలు అందించడం జరుగుతుందని, ఆగస్టు-2022 వరకు సదరం శిబిరం ద్వారా దృవపత్రాలు పొందిన అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, శిబిరంలో హాజరైన దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి దృవపత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సదరం సర్టిఫికెట్ల కొరకు మీసేవ,సదరం శిబిరంలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తక్కువ శాతం వచ్చిన దివ్యాంగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 6 వేల మంది దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, పెన్షన్ పొందుతున్న వారి వివరాలతో గ్రామ, మండలాల వారీగా నివేదిక అందించాలని, వీరిలో ఓటరుగా నమోదైన వారిని జాబితాలో దివ్యాంగుల విభాగంలో ప్రత్యేకంగా మార్కు చేయించాలని తెలిపారు. జిల్లాలో కిడ్నీ బాధితుల కొరకు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుతో పాటు సదరం శిబిరాలు అన్నీ ఆసిఫాబాద్ కేంద్రంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, వైద్యాధికారులు స్వామి, సత్యనారాయణ, డి.పి.ఎం. యశోద, అధికారులు తదితరులు పాల్గొన్నారు.