జై బోలో గణేష్ మహారాజ్ కి జై

Published: Thursday September 09, 2021

మధిర, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంక్షేమం సంఘం సహకారంతో శ్రీ వినాయక వ్రత కల్పం ప్రతులు పంపిణీ ఈరోజు మధిర పట్టణంలో రాజాజి రోడ్డు నందు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమం సంఘం అధ్యక్షులు శ్రీ సిద్ధం శెట్టి  శ్రీకాంత్ గారి ఆర్థిక సహకారంతో శ్రీ సిద్ధి వినాయక వ్రత కల్పముపుస్తకాలు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు, మరియు పెద్దలు జంగా వెంకట్రావమ్మ యర్రా సుబ్బమ్మ చేతమహంకాళివిఘ్ణేశ్వర వ్రతకల్పం పూజా విధానం ప్రతులు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా ఆర్య వైశ్య సంక్షేమ సంఘం చైర్మన్ పల్లపోతు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో కోమటిడి శ్రీనివాసరావు, యర్రా లక్ష్మణ్, చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి కోమటి సుధాకర్ కొల్ల శ్రీనివాసరావు మహంకాళి వెంకట శ్రీనివాసరావు కిరాణ, ఇరుకుళ్ళ సురేష్, కూరపాటి హరి వట్టికొండ నాగేశ్వరరావు గార్లు పాల్గొన్నారు