శ్రావ్యశ్రీ, సాత్వికలను ఆశీర్వదించిన ఎస్సై, జర్నలిస్టులు..

Published: Friday February 10, 2023
తల్లాడ, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మండలంలోని అన్నారుగూడెంకు చెందిన ఇస్నపల్లి శ్రీనివాసరావు, మార్తమ్మ కుమార్తెలు శ్రావ్య శ్రీ, సాత్విక ఓణీల అలంకరణ వేడుక గురువారం గ్రామంలో నిర్వహించారు. ఈ వేడుకకు తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి. సురేష్,  సీనియర్ జర్నలిస్టులు గుడిపల్లి నారాయణ, ఎండీ. బహుదూర్ హాజరై చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తాళ్లూరి దర్గయ్య, గొడ్ల బాబురావు ఉన్నారు.*