చిన్న కుటుంబం చింతలేని కుటుంబం

Published: Friday July 09, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుమలత ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్ అధ్యక్షతన అంతర ఇంజక్షన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అధిక జనాభా అనర్థాలకు మూలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే కాకుండా అర్హులైన దంపతులు అంతర వంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి అనుసరించాలని, అంతర ఇంజక్షన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ తీసుకోవాలని, పిల్లలు కావలసినప్పుడు ఈ ఇంజక్షన్ ఆపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, ఏ.పి.ఎం. ఓ సువర్ణ కుమారి, సూపర్వైజర్ లు అనురాధ, శ్రీలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ ఆశా కార్యకర్తలు గీత, జ్యోతి సబిత, లక్ష్మి, తెరిసా, ధనలక్ష్మి, సుజాత, అంగన్వాడి టీచర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.