కుక్కల స్వైర విహారం, పట్టించుకోని అధికారులు రోడ్లపై, వీధుల్లో తిరగాలన్న భయపడుతున్న గ్రామ ప్

Published: Thursday February 23, 2023

 

బోనకల్ ఫిబ్రవరి 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో వీధుల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బయటకొచ్చిన చిన్నారులను భయాందోళనకు గురి చేస్తూ ఆటలాడుకునే చిన్నపిల్లలపై దాడికి పాల్పడుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వీధుల్లో, రోడ్లపై తిరగాలన్న వెంబడించి ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ఎన్నిసార్లు మండల అధికారులకు తెలియపరిచిన మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదనీ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో పలువురు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పెద్దలు ,చిన్న పిల్లలపై దాడికి పాల్పడుతున్నాయి. దీంతో పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతూ ఆందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలను పట్టుకోవాల్సిన అధికారులు మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో తదితర ప్రాంతాలలో కుక్కల బెడద గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట బయట తిరగాలన్న శునకాలు వెంబడించి కుక్క కాటుకు బలి చేస్తున్నాయి. ఎదురుపడే వారిపై దాడిచేస్తున్నాయి. కుక్కల అరుపులతో వీధుల్లో నడవడానికి పలువురు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏ కుక్క వచ్చి మీదపడుతుందోనన్న బెంగ స్థానికులను కుంగదీస్తోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.బోనకల్ ఫిబ్రవరి 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో వీధుల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బయటకొచ్చిన చిన్నారులను భయాందోళనకు గురి చేస్తూ ఆటలాడుకునే చిన్నపిల్లలపై దాడికి పాల్పడుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వీధుల్లో, రోడ్లపై తిరగాలన్న వెంబడించి ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. ఎన్నిసార్లు మండల అధికారులకు తెలియపరిచిన మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదనీ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో పలువురు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పెద్దలు ,చిన్న పిల్లలపై దాడికి పాల్పడుతున్నాయి. దీంతో పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతూ ఆందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలను పట్టుకోవాల్సిన అధికారులు మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో తదితర ప్రాంతాలలో కుక్కల బెడద గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట బయట తిరగాలన్న శునకాలు వెంబడించి కుక్క కాటుకు బలి చేస్తున్నాయి. ఎదురుపడే వారిపై దాడిచేస్తున్నాయి. కుక్కల అరుపులతో వీధుల్లో నడవడానికి పలువురు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏ కుక్క వచ్చి మీదపడుతుందోనన్న బెంగ స్థానికులను కుంగదీస్తోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.