108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ నామాకు వినతి

Published: Monday August 23, 2021
మధిర, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరావు గారిని కలిసిన సిపిఐ బృందం.మధిర నియోజకవర్గ కేంద్రం లోని 108 ను వేరే ప్రాంతానికిపంపించి మధిర కు 108 లేకుండా చేసారని, మధిర మండల ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలందిస్తున్న 108 వాహనాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఐ బృందంఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత రాత్రి శుభకార్యాల్లో పాల్గొనేందుకు మధిరకు వచ్చిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరావు గారిని సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు బెజవాడ రవి ఊట్ల కొండలరావుల ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర ప్రాంత ప్రజలకు సుమారు పదినెలల క్రితం మీరు ఇచ్చిన అంబులెన్సు ఈరోజు వరకూ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదని ఎంపీ నామా దృష్టికి తీసుకొచ్చారు.  గత  దశాబ్ద కాలం పైగా సేవాలందిస్తూ వస్తున్న 108ను మధిర మండలం లోని అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే వేరేప్రాంతానికి తరలించారని వారు విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గత పది నెలలుగా చెట్లకింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరూపయోగంగా ఉన్న అంబులెన్సు 108 కు బదలాయించి మధిరకు ఇవ్వాలని కోరారు.అలాగే గత కొన్నేళ్లుగా మధిర మండలంలోని అల్లినగరం, బయ్యారం ప్రజలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడే అల్లినగరంటూ మోటమర్రి రోడ్ పూర్తిగా పాడై పోయిందన, దానిని కొత్తగా తారు రోడ్ వేసి రైతులకు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన నామా గారు సంబందించిన జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడి వారు మధిరకు ఇచ్చిన అంబులెన్సును ఎందుకు ఇప్పటి వరకూ వినియోగంలోకి తేలేదని డీ ఎం & హెచ్ ఓ ను వెంటనే మధిరకు 108 సౌకర్యం కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అల్లినగరం టూ మోటమర్రి రోడ్డును కూడా ఈ సంవత్సరమే పూర్తి చేస్తానని ఎంపీ నామా సిపిఐ బృందానికి హామీ ఇచ్చారు.