*జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి.* - టీ డబ్ల్యు జే ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు తోట్ల మ

Published: Wednesday April 19, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 18, ప్రజాపాలన: అర్హులైన జర్నలిస్ట్ లకు వెంటనే ఇండ్ల స్థలాలు,ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్,గోపతి సత్తయ్య లు డిమాండ్ చేశారు.జర్నలిస్ట్ లకు ఇండ్ల సాధన కోసం మంగళవారం టీ డ్ల్యూ జే ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు ఆయా యాజమాన్యాలు ఇచ్చే చాలీ చాలని వేతనాలతో దుర్బర జీవితాలు గడుపుతున్నారన్నారు.కనీసం ఇండ్లు కూడా లేక అద్దె కట్టలేని పరిస్తితుల్లో జర్నలిస్ట్ లున్నారన్నారు.జర్నలిస్ట్ లకు ఇల్లు,ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక జర్నలిస్ట్ లకు మొండి చేయి చూపించిందన్నారు.ఇతర జిల్లాలలో ఇప్పటికే ఇళ్ళ స్థలాలు కేటాయించింది కానీ మంచిర్యాల జిల్లాలో అటువంటి చర్యలు కానరావడం లేదన్నారు.ఈ సమస్యలపై దశల వారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తాము,మంత్రులు,ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం,రాబోవు రోజుల్లో రిలే నిరాహార దీక్షలు చేపాడుతామని తెలిపారు. వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి అర్హులైన జర్నలిస్ట్ లకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్,సాగర్,మధుసూధన్, లక్ష్మణ్, జాడి వెంకట్,శ్రీనివాస్,రాజ బానయ్య,భవిష్యత్ లు పాల్గొన్నారు.