కార్మిక కర్షక పక్షపాతి అలిశెట్టి --ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Friday January 13, 2023

జగిత్యాల, జనవరి12 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కేంద్రంలో కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్  జయంతి, వర్థంతి సందర్భంగా వారి విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు  జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అర్పించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ రచనలు సమాజానికి ప్రేరణ కలిగించాయి. బీద బడుగు వర్గాల, కార్మిక కర్షక అభ్యున్నతికి అలిశెట్టి కృషి. వారి రచన చిన్నగా ఉన్నా భావం చాలా గొప్పది అని అన్నారు. అలిశెట్టి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన అండగా ఉంటామని అన్నారు.