బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి

Published: Friday June 18, 2021

- కొనుగోలుదారుల ప్రయోజనమే మా లక్ష్యం
 - మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
 
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : కొనుగోలు దారులకు ప్రయోజనం చేకూర్చేందుకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కట్టుబడి ఉంటుంది అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం పెళుసుగా ఉండి త్వరగా విరిగిపోయే స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు వర్తకులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత పార్లమెంట్ 1986 సంవత్సరంలో సంరక్షణ చట్టం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పనిసరి చేయడం జరిగిందని అన్నారు. ఈ చట్టం అమలులో ఉన్నప్పటికీ కొందరు వర్తకులు వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు అని అన్నారు. వినియోగదారులు తాము వెచ్చించిన డబ్బులకు 100% ప్రయోజనం చేకూర్చేలా తమ సంస్థ గత 21 సంవత్సరాలుగా హాల్ మార్క్ కలిగిన బంగారు ఆభరణాలను విక్రయిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతుంది అని తెలిపారు