ప్రజా సమస్యలపై పోరాడి పార్టీ కాంగ్రెస్ పార్టీ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు ప్రజల

Published: Monday June 13, 2022
నుండి బ్రహ్మరథం మధిర జూన్ 12 ప్రజా పాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండలంలో లో ఆదివారం నాడు పీపుల్ మార్ట్ పాదయాత్రలో భాగంగా ప్రజల నుండి ప్రజా సమస్యలపై జరుగుతున్న  పాదయాత్రclp భట్టి విక్రమార్క మేము సైతం అంటూ పాదయాత్రకు సంఘీభావంగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విలేకర్ల సమావేశంలో రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారుపెరిగిన సాగు పెట్టుబడికి ప్రోత్సాహం ఏదీ అమలుకాని రుణమాఫీ.వడ్డీ వ్యాపారులతో రైతులకు ఇబ్బందులుకాంట్రాక్టర్లకు కట్టబడుతున్న ఈజీఎస్ నిధులుపీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రభుత్వంపై సీఎల్పీ నేత ఫైర్రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు  ప్రవేశించి వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ  సాగు పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేయలేదని, ఇంకెప్పుడు జమ చేస్తారని  సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పెంచిన ధరలతో ఇప్పటికే సాగు పెట్టుబడి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం ఎర్రుపాలెం మండల కేంద్రం నుంచి కేశిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ మీదుగా రేమిడిచర్ల, జమలాపురం  గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. పెరిగిన డీజిల్ ధరల వల్ల రైతులకు వ్యవసాయం సాగు పెట్టుబడి పెరిగిందని, పంట రాబడి తగ్గిందని వివరించారు. పంట రుణాలు సమయానికి ఇవ్వకపోవడం తో పాటు అమలు కాని రుణ మాఫీతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో పాటు ధాన్యం కొనుగోలు  జాప్యం కావడంతో  రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకోవడం కోసం తక్షణమే ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయడంతోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.   డీజిల్, ఎరువుల ధరలు పెరిగినందున పెట్టుబడి సాయం కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూమి లేని రైతుకూలీలు జీవన స్థితి గతి గ్రామాల్లో దయనీయంగా మారిందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి కల్పించాలని   కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నదని  విమర్శించారు. కూలీల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని లక్ష్యానికి తూట్లు పొడవకుండా వ్యవసాయ కూలీలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధంగా 100 రోజుల నుంచి 250 రోజుల పనిదినాలు ఈ పథకం ద్వారా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులతో పాటు రైతు కూలీలకు ఉపాధి కల్పించవచ్చాన్నారుఈ భగీరథ నీళ్లు ఎట్లా తాగాలి? కేసిరెడ్డిపల్లి గ్రామస్తులు ఆవేదన"*
పాదయాత్రలో భాగంగా ఎరుపాలెం మండల కేంద్రం నుంచి రేమిడిచర్ల గ్రామానికి వస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసిరెడ్డిపల్లి గ్రామస్తులు గ్రామ శివారులో కలిసి వారు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య గురించి విన్నవించారు. కేసి రెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బోరుకు ఉన్న మంచి నీటి పైప్ లైన్ కలెక్షన్ తొలగించి మిషన్ భగీరథ కు ఇచ్చారని తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు పూర్తిగా కలుషితం గా రావడంతో తాగడానికి మంచినీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తమ ఆవేదనను విన్నవించారు. మిషన్ భగీరథ నీటిని వాటర్ బాటిల్ లో తీసుకువచ్చి చూపించారు.  రంగు మారిన కలుషిత నీటిని చూసి చలించిన సీఎల్పీ నేత వెంటనే స్పందించారు. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామస్తులు చెబుతున్నట్లుగా బోరు వేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. సీఎల్పీ నేత సానుకూల స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి కిషోర్ బండారు నరసింహారావు రామారావు బాలరాజు కృష్ణారావు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు