డేంగ్యు దొమల పట్ల ప్రజలు ఆప్రామతంగ ఉండాలి: ఎంపీడీవో వేణుమాధవ్

Published: Monday August 22, 2022

బోనకల్, ఆగస్టు 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో ఆదివారం డేంగ్యు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలలో బాగాంగ గ్రామం లో ముమ్మరంగా శాన్ టేషన్, డ్రేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పరిషరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాతటైర్లు కోబ్బారి బోండాలు, ప్లాస్టిక్ కవర్ లు పాతకుండలలో నీటి తోట్టిలో నీరు నిల్వ లేకుండా చేయాలని సూచించారు. 4 బృందాల ద్వారా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నీటి గుంటలలో తిమొపాస్ మంందు ను స్ప్రే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమన్ని ఎంపీడీవో వేణు మాధవ్, ఎం పి ఓ శాస్త్రి, హెల్త్ సూపర్ వైజర్ దానాయ్య, ఏఎన్ఎం తిరపతమ్మ ,సర్పంచ్ మర్రి తిరుపతిరావు లు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఫీల్డ్ ఆస్టేంటు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.