పెగాసస్ సాఫ్ట్వేరు ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు

Published: Friday July 23, 2021
బాలాపూర్, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ దుశ్చ్ర్యలను ఖండిస్తూ, చలో రాజధాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నేతలు. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొని, కాంగ్రెస్ నేతలందరూ ప్రసంగించారు.... వ్యక్తిగత గోప్యత సమాచార చట్టానికి నీరు కాస్తున్న పనుల వల్ల ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతుందని అన్నారు. ఈ పేగాసస్ సాఫ్ట్వేర్ ను రద్దు చేయాలని ప్రభుత్వ నిందితులను కఠినంగా శిక్షించాలని ఎందరివో జీవితాలను పాడుచేస్తూ అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. చలో రాజధానికి కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, పిసి సి కార్యదర్శి వి.ప్రభాకర్ రెడ్డి, జిల్లా డిసిసి జనరల్ సెక్రెటరీ దేవగొని కృష్ణ, మహేశ్వర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఆల శ్రీనివాస్ రెడ్డి, బడంగ్ పేట్ కార్పొరేటర్ పెద్ద బావి వెంకట్ రెడ్డి, మీర్ పేట్ కార్పొరేటర్ భర్త చల్లా బాల్ రెడ్డి, సిద్ధల శ్రీశైలం, విజేందర్రెడ్డి, బాలాపూర్ జంగయ్య, యువజన నాయకులు అయిత రాజు, భాస్కర్, మీర్ పేట్ కీసర యాదిరెడ్డి, సుభాష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.