రాయికల్ పురపాలక సంఘం అంతర్జాల (ఆన్లైన్లో)సేవలు అందుబాటులో - మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు

Published: Friday May 20, 2022

రాయికల్, మే 19 (ప్రజాపాలన  ప్రతినిధి): రాయికల్ పురపాలక సంఘం ఇకనుండి పట్టణ ప్రజలఇంటి పన్ను, ఆస్తిపన్ను మునిసిపల్ నీటి కుళాయిలరుసుము, ఫిర్యాదులనమోదు, వ్యాపారసంస్థలకు (దుకాణము లైసెన్స్) అనుమతి, నూతనగృహాలను నిర్మించుకోవడానికి అనుమతులు,గృహ నిర్మాణాలకు ఉపయోగించే భూముల యొక్క లేఅవుట్ ల అనుమతులు, యు.పి.ఐ ద్వారా సేవలు పొందడానికి ఉపయోగించే డిజిటల్ బోర్డులను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ బోర్డులు రాయికల్ పట్టణంలో ప్రధాన కూడళ్లలో మరియు జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చేస్తామని ఈ సేవలను పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది దగ్గర కూడా క్యూఆర్ స్కాన్ కోడ్ లు అందుబాటులో ఉంటాయని, గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా పన్నులు కట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంతోష్ కుమార్, కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, మహేందర్. ఆప్షన్ సభ్యుడుమహేందర్ బాబు. మున్సిపల్ కార్యాలయ మేనేజర్ వెంకట్,జూనియర్ అసిస్టెంట్ గంగనరసయ్య, టి.ఆర్. ఎస్. పట్టణయూత్ ప్రెసిడెంట్ మోరరామ్మూర్తి, రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.