అవనిలో సగం ఆకాశంలో సగం మహిళా మణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ స్రవంతి

Published: Thursday March 09, 2023

బోనకల్: అవనిలో సగం..ఆకాశంలో సగం.. అన్నింటా సగం అయిన మహిళలకు ఎటువంటి హక్కులు ఉండేవికావు అని బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యు రాలు డాక్టర్ స్రవంతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదని, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలమీద అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఈ మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నా మనీ ఆమె అన్నారు.మహిళల పోరాటంలోంచి కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందీ మహిళా దినోత్సవం..మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు మహిళలు. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని,మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో పద్దతిలో చేశారు. కానీ ఎవరు ఎటువంటి పద్ధతిలో పోరాటాలు చేసినా అవన్నీ మహిళల హక్కుల కోసమే జరిగాయ అని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన బోనకల్, కలకోట సెక్టార్ల సిస్టర్లు నవనీత , తిరుపతమ్మలకు అధికారులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆశాలు, ఏఎన్ఎం లు, నర్సులు అందరూ కలిసి డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ స్రవంతి లకు వీరందరూ కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, డిప్యూటీ తాసిల్దార్ సంగ్ శ్వేత, ఎంపీ ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ స్రవంతి, బోనకల్ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, గిర్ధవర్ గుగులోత్ లక్ష్మణ్, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, మండల ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.