మణుగూరు సింగరేణి డ్రైవర్స్ కు రక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించిన మాలోత్ రాముడు. ట్రాఫిక్ ర

Published: Saturday October 08, 2022
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన.
   సింగరేణి హెచ్ ఇ ఎం ఎం కార్మికులతో రక్షణ        అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ మాలోత్ రాముడు    అక్టోబర్ 1 నుండి 15వ తేదీ వరకు సింగరేణి ఉపరితల గనులలో  నిర్వహిస్తున్న భారీ యంత్రాల యేతర వాహన కదలికలపై (గూడ్స్ వెహికల్స్ అండ్ పాసింజర్ వెహికల్స్) డ్రైవర్ల రక్షణ అవగాహన  పక్షోత్సవాల సందర్భంగా పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఓ సీ2 లో నిర్వహించిన డ్రైవర్ల రక్షణ అవగాహన పక్షోత్సవాల కార్యక్రమానికి  పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీ మాలోత్ రాముడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు, ఓపెన్ కాస్ట్ గనులలో నిత్యం భారీ యంత్రాలు రద్దీగా నడుస్తూ ఉంటాయని కన్వీనేన్స్ వాహన మరియు ఇతర వాహనాలైన డీజిల్ బోజర్లు, మినీ క్రేన్లు, ట్రాక్టర్ డోజర్లు, నిర్వహణ వాహనాలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని ప్రమాదాలు నివారించాలని కోరారు అదేవిధంగా సమయపాలన పాటించాలని,డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC) అన్ని ఫోర్స్ లో ఉండేలా చూసుకోవాలనీ వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని , దురలవాట్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ ఉపయోగించరాదని, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని,గని రహదారులపై, పాటించవలసిన ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఎంవిటిసి శిక్షణ పొంది ఉండాలని  తనతో పాటు తన వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రత కూడా తనకు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు రక్షణ విభాగం ఏర్పాటుచేసిన వాహన డ్రైవర్లు పాటించవలసిన విధులు ఎస్ఓపి కరపత్రాన్ని డ్రైవర్ జల్లా అశోక్ తో చదివించారు అనంతరం సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేపించారు, ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి శ్రీ ఎం లింగబాబు, వరుణ్, సేఫ్టీ హెడ్ ఓవర్ మెన్ డి కార్తీక్, ఎస్ ఓ పి సమన్వయకర్త నా సర్ పాషా, బి బిక్షపతి, కే ఉపేందర్ పెద్ద ఎత్తున డ్రైవర్లు పాల్గొన్నారు.