మధిర మండలం లో జోరుగా కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్

Published: Monday April 10, 2023
మధిర, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: నియోజకవర్గ శాసనసభ్యులు *మల్లు భట్టి విక్రమార్కఆదేశాలతో మధిర మండలంలో ఇల్లూరు గ్రామంలో *హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ ఇంటి ఇంటికి తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని రాహుల్ గాంధీ సందేశాన్ని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన కరపత్రాన్ని అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ,ఒకేసారి రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు.
రైతుబంధు ఎకరాకు రూ.15 వేలకు పెంపు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ.భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12వేలు. వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితముగా 5 లక్షలు.ఆసరా పింఛన్లు ప్రతి అర్హులైనవారందరికీ పింఛన్లు ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే 5000రూపాయలు , ప్రతి వికలాంగులకు 4000 రూపాయలు,ఉపాధి హామీ పథకంలో పని దినాలు కుటుంబానికి 300 రోజులు మరియు రోజు వేతనం 250 తగ్గకుండా ఇవ్వడం జరుగుతుందని,పేదలకు అవసరమైన పధకాలను ప్రవేశపెడతామన్నారు..ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పత్తే పరపు సంగయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలివేరు బుచ్చిరామయ్యా,సేవాదల్ అధ్యక్షుడు అదురీ శ్రీను కాంగ్రెస్ నాయకులు అయిలూరి సత్యనారాయణ రెడ్డి, బిట్ర ఉద్దండయ్యా,కోట డేవిడ్,మైలవరపు చక్రి, జమిల్ పాషా, గ్రామ కాంగ్రెస్ నాయకులు పి రవిబాబు, కోటా రమేష్, మడుపల్లి రామారావు, కోట చిన్నప్ప, కోట దాసు, కోట నాగేశ్వరరావు, కోట జోగయ్య కొండ వెంకట్రావు మొదలవారు పాల్గొన్నారు.