ప్రముఖ సీనియర్ న్యాయవాది అబ్దుల్ రజాక్ మాతృమూర్తి వియోగం పట్ల మద్దెల సంతాపం

Published: Tuesday March 30, 2021
స్వర్గీయ కుబ్రా బేగం  ఎంతో గొప్ప ఔన్నత్యం
దాతృత్వం గల గొప్ప మాతృమూర్తి
భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల  శివ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి : ప్రముఖ సీనియర్ న్యాయవాది మరియు అభ్యుదయవాది అయిన అబ్దుల్ రజాక్ గారి మాతృమూర్తి శ్రీమతి కుబ్రా బేగం( 85 స0 )ఎంతో గొప్ప మంచి మనసున్న మానవతా మూర్తి అని అందరినీ ఆదరించి గౌరవించే ఆదర్శ మూర్తి అని ఆమె అకాల మృతి ఎంతో హృదయవిదారక మని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు 29 03 2021 నాడు మద్దెల తన బృందంతో హౌసింగ్ బోర్డు కాలనీలో గల న్యాయవాది అబ్దుల్ రజాక్ స్వగృహానికి వెళ్లి వారి మాతృమూర్తి అయినకుబ్రా బేగం భౌతికకాయం వద్ద పూలమాలలు పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు
అబ్దుల్ రజాక్ ను ఓదార్చి వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. ఈ నివాళి కార్యక్రమంలో మద్దెల తోబాటు సంఘ నాయకులు సబ్బవరపు మధుసూదన్ చిన్ని అంతోటి పాల్ మందా హనుమంతు కూ సపాటి శ్రీనివాస్ అంతోటి రాజు రఘు మాజీ సింగరేణి అధికారి సాయి కృష్ణ ప్రముఖ న్యాయవాదులు మెండు రాజమల్లు  అడపాల పార్వతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు