కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం

Published: Tuesday March 14, 2023

బోనకల్ ,మార్చ్ 13 ప్రజాపాలన ప్రతినిధి: ఈనెల ఒకటో తారీకు నుంచి 13వ తారీకు వరకు తూటికుంట్ల గ్రామంలో జరిగినటువంటి కంటి వెలుగు కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కంటి సమస్యలను డాక్టర్ల బృందానికి వివరించడం జరిగింది. పరీక్షించిన డాక్టర్లు గ్రామ ప్రజలకు తగు సలహాలు సూచనలు ఇస్తూ కళ్ళు మసఃగా ఉన్నటువంటి పేషెంట్లకు కళ్లద్దాలు ఇస్తూ వారికి కావలసినటువంటి మందులను సరఫరా చేసినారు.సుదీర్ఘంగా 13 రోజులు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో డాక్టర్లు అంకితభావంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ గ్రామ ప్రజలకు సేవలు అందించినారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక , ఆప్తమాలజిస్ట్ లెనిన్ ,సిహెచ్ఓ దానయ్య , ఏఎన్ఎం నవనీతమ్మ , గ్రామ సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ , వైస్ సర్పంచ్ తుళ్లూరు కొండలరావు , ఆశ వర్కర్స్ ,మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్ ,నోముల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.