ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021
సిద్దిపేట(ప్రజాపాలన ప్రతినిధి) : భారత దేశపు తొలి దళిత ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి 114 వ జయంతి వేడుకలు సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్ సిద్దిపేట మండల ఇన్చార్జి చుంచు రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుంచు రమేష్ మాదిగ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు షాబాద్ జిల్లా నిశ్చింత గ్రామంలో 1908లో శిబిరం వాసంతి దేవి దంపతులకు జన్మించారని ఈయన చిన్నతనం నుండే అహింసా మార్గాన్ని గాంధేయవాదాన్ని ఎన్నుకున్న టువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహా వ్యక్తి ఆయన అని అన్నారు. మహానుభావుల ఆలోచనా విధానాన్ని ప్రతి యువత ఆచరించాలని అప్పుడే అభివృద్ధిలోకి రాగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సందులపురం ప్రసాద్, బోనగిరి లక్ష్మణ్, అశోక్, రజినీకాంత్, తదితరులు  పాల్గొన్నారు.