పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మండల పార్టీ నిరసన కార్యక్రమం

Published: Saturday March 04, 2023
బోనకల్, మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశానుసారం మండల కేంద్రంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు అనుగుణంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్రం అడ్డగోలు గా గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై అధిక భారం మోపుతూ నోటికొచ్చిన అంకెను పెంచుకుంటూ పోతున్న గ్యాస్ సిలిండర్ ల ధరల పెంపు పై బోనకల్ మండల కేంద్రం ఖమ్మం క్రాస్ రోడ్డు సెంటర్ లో మహిళలతో పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్ , ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సైదా, మూడవత్ సైదా,  పెంటు సాహెబ్, నాయకులు ఇటుకల శ్రీనివాసరావు, తన్నీరు పుల్లయ్య, రజక సంఘం నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, బోనకల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బోనకల్ గ్రామ రైతు కన్వీనర్ మోర్ల నరసింహారావు,మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.