పట్టణ ప్రగతిలో శానిటేషన్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday July 01, 2021
మేడిపల్లి, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ ప్రగతిలో శానిటేషన్ పాత్ర కీలకమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ లో జూలై 1 నుండి ప్రారంభించే పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముందస్తు సమీక్ష  సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ డ్రైనేజీ, శానిటేషన్, దోమల నివారణ, హరితహారం, తాగునీటి సమస్య పరిష్కారం, ఎలక్ట్రిసిటీ స్తంభాలు ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు, వైకుంఠ దామంలలో పచ్చదనం పరిశుభ్రత, బోర్ వెల్, వర్షాకాలం శానిటేషన్ సిబ్బందికి అవసరమైన పరికరాలను అందజేయాలని సూచించారు. ప్రతి డివిజన్ను పరిశుభ్రంగా ఉంచాలని, ఓపెన్ ప్లాట్లలో చెత్త పిచ్చి మొక్కలు తొలగించాలని, అధికారులు ఒకరికొకరు పరస్పర సహకారంతో పరిశుభ్రత పనులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, ఈఈ నాగేందర్, ఉప్పల్ సర్కిల్ కార్పోరేటర్లు రజిత పరమేశ్వర్రెడ్డి, బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్, చేతన హరీష్, శ్రీ వాణి వెంకట్రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జలమండలి అధికారులు, ఎలక్ట్రిసిటీ ఏఈలు, ఎంటమాలజీ సిబ్బంది, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఎస్ ఎఫ్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.