అతి రుద్ర మహా యజ్ఞ సప్తాహం

Published: Wednesday December 21, 2022
వేద పండితులు జోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ
వికారాబాద్ బ్యూరో 20 డిసెంబర్ ప్రజా పాలన : వాగర్ధావివ సంపృక్తౌ - వాగర్ధ ప్రతిపత్తయే  జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా . ఈ జగతికే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము మానవాళిపై ఉండాలని వేద పండితులు జోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి మైదానంలో అతి రుద్ర మహా యజ్ఞ సప్తాహం కార్యక్రమం ఏర్పాట్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రజా పాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడారు. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్యాత్మిక సేవ మండలి మహిళలు అతి రుద్ర మహా యజ్ఞ సప్తాహం కార్యక్రమానికి పూల మాలలు తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదాత్తమైన భావనతో గత 11 సంవత్సరాలుగా వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో జరుపుతున్న వృద్ధాభిషేకం మహోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరము అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. మహాగణపతి, శత ఛండీ, రాజశ్యామల, మహా సుదర్శన యజ్ఞ సహిత సంతత ధారాభిషేకం చతుర్వేద పారాయణం నిత్యం శాంతి కళ్యాణ ఉత్సవాలు జరుపబడునని వివరించారు. రుదం ద్రావయతీతి రుద్రః మానవుల ఈతి బాధలను రుగ్మతలను కష్టాలను పాపాలను రూపుమాపే వాడే రుద్రుడు. రుద్దుడు యజ్ఞస్వరూపుడు జలధార ప్రియుడు భక్తసులబుడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నిస్వార్ధంగా ధర్మకార్యాలు దైవకార్యాలు ఆచరించినప్పుడే యజ్ఞ ఫలితాలు మానవజాతికి లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.