సిపిఎస్ అంతం ఉపాధ్యాయ సంఘాల పంతం

Published: Friday September 02, 2022

బోనకల్, సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ కోశాధికారి వల్లం కొండ రాంబాబు , పి ఆర్ టి యు నాయకులు సిహెచ్ రవిమాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటి సాకులు చెబుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుబులోత్ రామకృష్ణ ,కే రమేష్ ,పి గోపాలరావు, చంద్ర, ప్రసాద్, సధాబాబు,ఎ పుల్లారావు, పిఆర్ టి యు నాయకులు సు జాత, రామ్మోహన్, బంధం వెంకన్న, టిపిటియఫ్ నాయకులు రమేష్, రవి కిరణ్ ,రామరాజు, టి టి యఫ్ నాయకులు యల్ల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.