సీసీ కెమెరాలను పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై తేజావత్ కవిత

Published: Monday November 28, 2022
బోనకల్ నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీసీ కెమెరాలపై గ్రామపంచాయతీ కార్యాలయం నందు బోనకల్ ఎస్సై తేజావత్ కవిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కవిత, సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో దొంగల బెడద నివారించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటుకు వ్యాపారస్తులు, ప్రముఖులు సహకరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు గురించి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ,అమాయకులను చట్టం నుండి రక్షించడానికి సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడతాయని, సీసీ కెమెరాల పుటేజ్ వల్ల దొంగలకు కోర్టులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపినారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా సిసి కెమరాలు ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలు ఎంతోగానో పయోగపడతాయన్నారు.
సీసీ కెమెరాలు నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తాయని తెలిపినారు. సీసీ కెమెరాల వల్ల నేరాలు జరుగాకుండా నియత్రించవచ్చని అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కుడా ఉపకరిస్తాయన్నారు.ప్రజల పోలీసుల మధ్య సమన్వయంతోనే నేరాలు నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపినారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య సైదానాయక్, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు మోర్ల ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్యా భద్రు నాయక్ ,వార్డు మెంబర్ మరీదు శ్రీను, పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామ వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.